ఒక మేకకు రూ.23 లక్షల డిమాండ్ ఉందంటే నమ్ముతారా, కానీ ఇది నిజం. మహారాష్ట్రలోని సతారా జిల్లాకి చెందిన చెంది సోనియా అనే మేక ఈ అరుదైన విలువని సొంతం చేసుకుంది.
సాధారణంగా ఒక మేక ఖరీదు 12,000 నుండి 16,000 వరకు ఉంటుంది. పండుగ సమయాల్లో మరి కాస్స్థ ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా పెరిగిన కూడా లక్షల్లో మాత్రం ఉండదు. లక్ష రూపాయలు ఉంటె మంచి పాలిచ్చే ఆవులను లేదా గేదెలను కొనుగోలు చేయవచ్చు. అయితే మహారాష్ట్ర, సతారా జిల్లాలోని పటాన్ తాలూకా త్రిపురలో ఓ మేక ఏకంగా అక్షరాల 23 లక్షల ధరను కైవసం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
భారీ ధరకి గల కారణాలు:
అబాసో రామచంద్ర దేశాయ్ అనే రైతుకి చెందిన సోన్యా అని పిలవబడే మేక మేక వయస్సు ఒకటిన్నర సంవత్సరాలు మరియు దాని బరువు 65 కిలోలు. మేక ఏకంగా రూ.23 లక్షలు డిమాండ్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఈ మేక పుట్టుకతోనే తలపై నెలవంకతో పుట్టింది. ఇస్లాంలో ఈ చంద్రవంకకి చాలా ప్రాముఖ్యత ఉంది.తలపై చంద్రవంక ఉన్న మేకను బలి ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ముంబై, పూణేతో పాటు పలు ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు ఈ మేకకు భారీ ఎత్తున ధరని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మేక వేలం ధర రూ.23 లక్షలు కాగా, దాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ మేక ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరిన్ని చదవండి.
Share your comments