కేసీఆర్ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగాతెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ హామీలలో ఒకటి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు.
ఇటీవలి మంత్రి కేటిఆర్ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఆగష్టు 15వ తేదీన నిరుపేదలకు పంపిణి చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఆగస్టు నుంచి అక్టోబరు మూడో వారం నాటికి అవసరమైన వారికి సుమారు 70 వేల ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రి కేటిఆర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకునేలా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అర్హులైన లబ్ధిదారుల సమగ్ర జాబితాను కూడా రూపొందించారు. ఈ వార్తను విన్న లబ్ధిదారులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా ఈ లక్ష మందిలో అదృష్టవంతులు ఎవరనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం ... నేడు ,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..
దీనితోపాటు మంత్రి కేటిఆర్ గృహలక్ష్మి పథకం గురించి కూడా వివరించారు. ఇటీవల సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందించనుంది ప్రభుత్వం. త్వరలోనే ఈ పథకం ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments