News

బంగాళాఖాతంలో అల్పపీడనం ... నేడు ,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..

Srikanth B
Srikanth B
బంగాళాఖాతంలో అల్పపీడనం ... నేడు ,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ... నేడు ,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..

గత వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షలకు చాల కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి . ఇప్పుడిపుడే కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఆదివారం రోజున భారీ వర్షం కురిసింది. ఇక రెండ్రోజుల నుంచి తెరిపిచ్చింది.మళ్ళి రానున్న రెండురోజులు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ హెచ్చరికలు జారీచేసింది .

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు ఆగస్టు 3, 4 రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది .

పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ


అదేవిధంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తరవాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ నెల 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ

Related Topics

#untimely rains

Share your comments

Subscribe Magazine