News

పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ

Srikanth B
Srikanth B
పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ
పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ

ఆర్థికంగా వెనుకబడిన కులాలు (ఈబీసీ), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వర్గాలకు చెందిన పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్- యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా పీఎం యశస్వి యోజన అనే పథకాన్ని అమలు చేస్తుంది . ఈ పథకం క్రింద విద్యార్థులకు రూ. 75,000 నుంచి రూ 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది .

దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పీఎం యశస్వి యోజన క్రింద రూ. 75,000 నుంచి రూ 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందజేస్తోంది. అర్హులైన విద్యార్థు https://yet.nta.ac.in/frontend/web/site/login వెబ్సైట్ ద్వారా దరఖాస్తు లను సమర్పించవచ్చు . దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10 లోపు విద్యార్థులు దరఖాస్తు లను సమర్పించాలి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ల కొరకు మొత్తం 1,401 మంది తెలంగాణ రాష్ట్రంలో 1,001 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.


విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు ?
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) విధానంలో ఓఎంఆర్ షీట్స్‌పైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే స్కాలర్ షిప్ లభిస్తుంది .

దరఖాస్తు అవసరమైన పత్రాలు :

  • 9వ తరగతి విద్యార్థులు 8వ తరగతి పాసైనట్లు సర్టిఫికెట్‌
  • 11వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పాసైనట్లు సర్టిఫికెట్‌
  • విద్యార్థి మొబైల్ నెంబరు
  • విద్యార్థి ఆధార్ నెంబరు
  • కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • విద్యార్థి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాలు
  • పాస్‌పోర్టు సైజు ఫోటో
  • విద్యార్థి సంతకం. ఫొటో తీసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • పీఎం శ్రీ యోజన అంటే ఏమిటి ?

Related Topics

pmsri schools

Share your comments

Subscribe Magazine