ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త అందించింది , రేషన్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది .
నెలవారీ రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉపశమనం కల్గించే విధంగా ప్రస్తుతం ఏపీలో రేషన్ పంపిణీ కోసం లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ విధానం లో వేలి ముద్రలు సేకరిస్తూ బియ్యం పంపిణి చేస్తున్నారు , అసలే కూలీనాలీ చేసుకునే పేదలు, వేళ్లు కమిలిపోయి బయోమెట్రిక్ ద్వారా మెషీన్ లో వేలిముద్రలు పడని పరిస్దితి. దీంతో నెలవారీ రేషన్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి పదే పదే రేషన్ అందడం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
దీంతో ప్రభుత్వం ఇకపై వేలిముద్రలు పడని వారికి కంటి చూపుతో పనిచేసే ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం కోసం 9,260 కేంద్రాలలో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం దీనితో లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది .
ఇది కూడా చదవండి .
ఇకపై ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట కలగబోతోంది. ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ప్రకటించారు దీనికి సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ కు జారీ చేసింది .
ఇది కూడా చదవండి .
Share your comments