News

ఏపీ మహిళలకు శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసిన ప్రభుత్వం.! మీరు పొందారో లేదో చెక్ చేసుకోండి

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలను నెరవేర్చేవిధంగా, ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఒక శుభవార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం పథకం యొక్క నాలుగో విడత నిధులను విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ వైఎస్సార్ కాపు నేస్తం నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కాపు నేస్తం అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కు అర్హత పొందాలంటే, మహిళలు తప్పనిసరిగా 45 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం అనేది రూ.10 వేలు మరియు పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదు.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా పెరిగిన వంట నూనె దిగుమతులు.. ఈ సంవత్సరం ఎంతంటే?

రాష్ట్రంలో మొత్తం అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం మహిళలకు ఇస్తోంది.

కుటుంబాలు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండకూడదని లేదా 10 ఎకరాట మెట్ట.. రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబం కారు వంటి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే, వారు కాపు నేత కార్యక్రమానికి అనర్హులని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఆటోలు, టాటా ఏస్‌లు లేదా ట్రాక్టర్‌లు వంటి జీవనోపాధి ప్రయోజనాల కోసం ఉపయోగించే వాహనాలను కలిగి ఉన్న వ్యక్తులు ఈ పరిమితి నుండి మినహాయించబడ్డారు.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా పెరిగిన వంట నూనె దిగుమతులు.. ఈ సంవత్సరం ఎంతంటే?

Share your comments

Subscribe Magazine