కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. రెండో డీఏ పెంపు ప్రకటనకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి, ఇంతకీ ఎంత పెంచుతున్నారు? ఎప్పుడు ప్రకటిస్తున్నారు? దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందినవారు జూలై 2023కి డియర్‌నెస్ అలవెన్స్ (DA)కి సంబంధించి రాబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ ఏడాది మొదటి డీఏ నాలుగు శాతం పెరగ్గా.. తాజాగా రెండో డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వెయిట్ చేస్తున్నారు. పెంచిన డీఏను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో ఇప్పుడు ఈ తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం, డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్‌లను రెండుసార్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం కారణంగా నెలవారీ జీతం, పెన్షన్ సంపద తగ్గుతున్న కొనుగోలు శక్తిని ఎదుర్కోవడానికి కేంద్ర సర్కార్ ప్రతి ఆరు నెలలకోసారి DA రేటును సవరిస్తుంది.
ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెరిగినప్పుడల్లా.. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 4 శాతం పెరగవచ్చని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏను అదనంగా 4 శాతం పెంచితే మొత్తం 46 శాతానికి చేరుతుంది. దసరా మరియు దీపావళి పండుగలకు ప్రత్యేక కానుకగా డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సూచనలు ఉన్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..
రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్..! మూడు నెలలు మహిళలకు జగన్ నిధుల ప్రవాహం.!
అయితే అక్టోబర్లో డీఏ పెంచినా.. 2023 జులై నుంచి డీఏ వర్తిస్తుంది. ఈ నెలలో డీఏ పెంచితే జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరుగనున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments