ఈపీఎఫ్‌వో ( (Employees' Provident Fund Organisation)) పెన్షనర్లకు తీపికబురు అందించింది. లైఫ్ సర్టిఫికెట్‌ను ఎప్పుడైనా సమర్పించవచ్చని వెల్లడించింది. ఇది ఖచ్చితంగా ఈపీఎఫ్‌వో ( (Employees' Provident Fund Organisation) పెన్షన్ దారులకి ఉపశమనం కలిగించే విషయమే.
పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను ఎప్పుడైనా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. లైఫ్ సర్టిఫికెట్లు (life certificate) సమర్పించడంలో పింఛనుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. EPFO దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో EPS'95 పెన్షనర్లు ఇప్పుడు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌లను (life certificate) సమర్పించవచ్చని పేర్కొంది, అంతే కాకుండా ఇది సమర్పించిన తేదీ నుండి 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.
ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షన్ పొందేందుకు పింఛనుదారులు తమ జీవన ప్రమాణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం వలన పెన్షనర్ బతికే ఉన్నాడా లేదా అనే విషయం తెలుస్తుంది.అప్పుడే పెన్షన్ పొందే వారు జీవించి ఉన్నారని పెన్షన్ చెల్లింపు సంస్థ గుర్తిస్తుంది. ఒకవేళ ఈ ధ్రువపత్రం ఇవ్వకపోతే పెన్షన్ ఆగిపోతుంది. మళ్లీ సమర్పించిన తర్వాత మాత్రమే పింఛన్ వస్తుంది.
కామన్ సర్వీస్ సెంటర్‌లో డిపాజిట్ చేయవచ్చు
పింఛనుదారులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించవచ్చు. దాంతోపాటు పోస్టాఫీసును సందర్శించడం ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్‌లను (life certificate) సమర్పించవచ్చు.
EPFO (Employees' Provident Fund Organisation) గురించి తెలుసుకుందాం:
Employees' Provident Fund Organisation అనేది భారత ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న చట్టబద్ధమైన సంస్థ, ఇది భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్‌ల (Provident Fund) నియంత్రణ మరియు నిర్వహణకు బాధ్యత వహిస్తుంది.
ఇది 4 మార్చి 1952వ సంవత్సరంలో స్థాపించబడింది
EPFO ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు.
ప్రస్తుతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ (Provident Fund) స్కీమ్ కింద 8.5% వడ్డీ రేటును అందజేస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments