రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. రైతులకు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి ఆర్ధికంగా సహాయపడుతుంది. వీటితోపాటు రైతులకు ఎరువులపై మరియు విత్తనాలపై సబ్సిడీలను అందించి రైతులను వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కొత్త చర్యలను చేపట్టనుంది.
ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతు వేదికల ద్వారా రైతులకు ఎరువులను మరియు విత్తనాలను పంపిణి చేయాలని యోచిస్తుంది. ఈవిధంగా చేయడం ద్వారా రవాణా భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయం మరిత్యు సాగు పంటలపై చర్చించుకోవడానికి ఈ రైతు వేదికలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించింది. రైతులకు ఈ రైతు వేదికల ద్వారా వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఈ విత్తనాలు మరియు ఎరువుల పంపిణి సహ కార సంఘాలు, సంస్థలు, ప్రైవేటు డీలర్ల ద్వారా జాతిరుగుతున్నాయి అని, ఇకనుండి నేరుగా యంత్రాంగాన్ని రంగం దించాలని వ్యవసాయశాఖ ప్రయత్నిస్తుంది. దీని కొరకు కరీంనగర్ జిల్లాలో ఉన్న 76 రైతు వేదికల ద్వారా విత్తనాలు, ఎరువులు పామోలిని చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
ఖర్జూరం తినడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు తెలుసా? ఇప్పుడే తెలుసుకోండి
రైతులకు ఎరువుల కొరత రాకుండా వారికి సమయానికి ఎరువులు మరియు విత్తనాలు అందేలా చూడటానికి ఇప్పుడు చేపట్టపోయే కార్యక్రమం సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రైతు వేదికల ద్వారా విత్తనాలు మరియు ఎరువులు పంపిణి చేస్తే రైతులకు సమస్యలు కూడా తగ్గుతాయి.
Share your comments