News

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద సున్నా వడ్డీ రాయితీ నేడు రైతులకు అందిస్తుంది .

KJ Staff
KJ Staff
YSR Zero Interest Loan  for Farmers
YSR Zero Interest Loan for Farmers

ఏపీలో రైతులకు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద సున్నా వడ్డీ రాయితీ నేడు రైతులకు అందనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం వర్తింపు జేస్తున్నారు. రైతులకు ఇప్పటి వరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్‌లో 6,27,908 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు.

ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. రైతులు రుణాలు సకాలంలో చెల్లించినా ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. ఇప్పుడు రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లలోకి జమ చేయాలని ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడుఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది.

 

Share your comments

Subscribe Magazine