News

రైతులకు శుభవార్త: మండలానికి మూడు డ్రోన్లు...

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. రైతులపై అధిక భారం పడకుండా రాష్ట్రంలో ఆర్బికేలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వాటిపై సబ్సిడీలను అందించి సహాయపడుతుంది. ఈ ఆధునిక కాలంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కిసాన్ డ్రోన్లను మంజూరు చేసింది. ఈ డ్రోన్లతో రైతులకు వ్యవసాయ పనులు అనేవి మరింత సులువుగా మారతాయి.

ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి అనేక యంత్రాలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పుడు అమలు చేయనున్న ఈ డ్రోన్ల పథకం ద్వారా రైతులకు పొలంలో విత్తనాలు, ఎరువులు, మరియు పురుఫుమందులను పిచికారీ చేయడం అనేది చాలా సులువుగా మారుతుంది. త్వరలోనే ఈ డ్రోన్లు రైతులకు అందుబాటులోకి వస్తాయి.

ప్రభుత్వం ఈ పథకాన్ని కిసాన్‌ డ్రోన్ల పేరుతో రైతుల కొరకు ప్రవేశపెట్టింది. ముందుగా మండలానికి మూడు డ్రోన్ల చెప్పున రాష్ట్రమంతటా మంజూరు చేస్తుంది. రైతులు ఈ డ్రోన్లను పొందడానికి బ్యాంకుల నుండి రుణాలను కూడా మంజూరు చేస్తుంది, దానితోపాటు డ్రోన్లపై సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. రైతులు ఈ డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మందులను పిచికారీ చేయవచ్చు.

ఇది కూడా చదవండి..

మిర్చి రికార్డు ధర .. కర్నూలు మార్కెట్ లో క్వింటా రూ.50,618

ఈ డ్రోన్లను పొందడానికి ఐదుగురు రైతులు కలిసి ఒక కమిటిగా ఏర్పడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో కమిటీకి రూ. 10 లక్షల విలువచేసే డ్రోన్లను అందిస్తారు. అంటే ఒక డ్రోన్ ధర వచ్చేసి రూ.10 లక్షలు. ఇందులో రూ.5 లక్షలను బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. మిగిలిన దానిలో రూ.4 లక్షలను సబ్సిడీ కింద రైతులకు ప్రభుత్వమే ఇస్తుంది. మిగిలిన రూ.1 లక్షను ఐదుగురు సభ్యులు కలిసి చెల్లించ వలసి ఉంటుంది.

ఈ డ్రోన్లను రైతు సభ్యులు పొందాలంటే, ఆ గ్రూపులో ఒకరు కచ్చితంగా ఇంటర్ చదివి ఉండాలి. మరియు పాస్‌పోర్టు కలిగి ఉండాలి. రైతులకు ఈ డ్రోన్లను నడపడానికి గుంటూరు లాంఫామ్‌లో అధికారులు శిక్షణ ఇస్తారు. ఒక మండలం నుండి మూడు రైతుల గ్రూపులు డ్రోన్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ డ్రోన్లను వినియోగించడం ద్వారా రైతులకు పని వేగవంతం అవుతుంది. పొలం అంతటా చాలా సులువుగా ఈ డ్రోన్ల సహాయంతో పురుగుమందులు పంటలకు పూర్తిస్థాయిలో అందుతాయి.

ఇది కూడా చదవండి..

మిర్చి రికార్డు ధర .. కర్నూలు మార్కెట్ లో క్వింటా రూ.50,618

Share your comments

Subscribe Magazine

More on News

More