News

మిర్చి రికార్డు ధర .. కర్నూలు మార్కెట్ లో క్వింటా రూ.50,618

Srikanth B
Srikanth B
Record price for chili  in Kurnool market Rs.50,618 per quintal
Record price for chili in Kurnool market Rs.50,618 per quintal

పెరుగుతున్న మిర్చి ధరలు రైతులను సంతోషాన్ని ఇచ్చేవే .. ఆశర్నిశలు శ్రమించి పంట పండించిన రైతుకు తగిన ధర వచ్చినప్పుడు కలిగే అంనందం అంత ఇంత కాదు .. అదే ఊహించిన దానికంటే అధిక ధర లభిస్తే ఇప్పుడు మనం అలంటి ఒక రైతు గురించి తెలుసుకుందాం !

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో గత మంగళవారం ఎండుమిర్చి క్వింటా గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో రూ.48,299 పలికింది.వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిర్చి ధర తులం బంగారం తో పోటీ పడుతుంది . ఈ నెల 18న గరిష్టంగా క్వింటా మిర్చి ధర రూ.48,699లు పలకగా, దానిని అధిగమిస్తూ సోమవారం రికార్డు స్థాయిలో రూ.50,618లకు చేరింది.

వెల్దుర్తి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మోహన్‌ అనే రైతుకు గరిష్టంగ రూ.50,618 ధర లభించింది. మద్దూరుకు చెందిన ప్రవీణ్‌ అనే రైతు తీసుకొచ్చిన మిర్చి క్వింటా రూ.49,699లు పలికింది. కర్నూలు మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటాకు కనిష్టంగా రూ.3,519, గరిష్టంగా రూ.50,618, మోడల్‌ ధర రూ.20,589లు చొప్పున నమోదైంది.

స్త్రీనిధి నిధులతో సబ్సిడీలపై సోలార్ పానెల్స్..

పెరుగుతున్న తెగుళ్ల దాడి దీనితో దిగుబడి పై తీవ్ర ప్రభావం పడడంతో మార్కెట్టుకు వచ్చే మిర్చి తగ్గింది దీనితో దళారుల మధ్య పోటీ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి అంటే కాకూండా తేజ రకం మిర్చికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండడం కూడా కారణం , భారతదేశం నుంచి ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా, వ్యాపారులు పోటీ పడి ధర పెంచుతున్నారు.

స్త్రీనిధి నిధులతో సబ్సిడీలపై సోలార్ పానెల్స్..

Share your comments

Subscribe Magazine