News

రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !

Srikanth B
Srikanth B

భూ రికార్డుల డిజిటలైసెషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇప్పటికి అనేక రకాల సమస్యలు ఎదురుకుంటున్నారు అయితే వేంటనే వీటిని పరిష్కరించడానికి ధరణిలో కొత్తగ FAQ ఆప్షన్ ను తీసుకు రానున్నది ప్రభుత్వం దీనితో రైతు అన్ని సమస్యలకు ఇక్కడ సమాధానం పొందవచ్చు .

. రైతులు, అధికారులకు ఎదురైన సమస్యను పోర్టల్‌లో ఇచ్చే ఆప్షన్‌పై నమోదు చేస్తే దానికి ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఇంతకు ముందు అదే సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారం ఏంటనేది అక్కడ కనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్‌ ధరణిలో లేకపోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకలేదు.

ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పట్టా దారులకు ఇది ఎంతో ప్రయోజన కారిగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటివరకు ధరణి జిల్లా కోఆర్డినేటర్‌ లేదా టోల్‌ఫ్రీ నంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు సరైన సమాధానం వెంటనే అందించేలా కొద్దిరోజుల్లో ఎఫ్‌ఏక్యూను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం పెరిగి ధరణి రైతులకు ఒక ప్రయోజన కరమైన పోర్టల్ గ మారనుంది .

ధరణి పోర్టల్ లో తప్పులపై పున:సమీక్ష..

Share your comments

Subscribe Magazine

More on News

More