అమరావతి రైతులకు హైకోర్టు నుండి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వారికి చెల్లించాల్సిన వార్షిక కౌలుపై విచారణ జరిగింది. సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది, సీఎఫ్‌ఎంఎస్ వద్ద కౌలుకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నిర్దిష్ట వివరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ప్రస్తుత పురోగతిని వివరించే సమగ్ర నివేదికను అందించాలని సీఆర్‌డీఏని ఆదేశించింది. దీంతో, విచారణ వాయిదా పడింది మరియు ఇప్పుడు ఈ నెల 10వ తేదీన విచారణ జరగనుంది. దీనిబట్టి త్వరలోనే ప్రభుత్వం అమరావతి రైతులకు చెల్లింపులు చేయనుంది.
రైతులకు కౌలు చెల్లింపులో చాలా కాలం నుండి జాప్యం జరుగుతోందని మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పిటిషనర్ పోతినేని శ్రీనివాసరావు తరఫున విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, ప్రభుత్వం ప్రతి ఏడాది చట్టపరంగా రైతులకు వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని న్యాయవాదులు అన్నారు. కానీ రైతులకు ఈ కౌలును విషయంలో ప్రభుత్వం లేట్ చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి..
రేషన్ కార్డ్ ఉన్నవారికి గమనిక.. సెప్టెంబర్ 30 లోగా ఈ పని చేయలేదంటే ఉచిత రేషన్ కట్ !
అయితే, అమరావతి రైతులకు కౌలు డబ్బులను చెల్లించడానికి ప్రభుత్వం రూ.200 కోట్ల విడుదలకు జీవో జారీచేసిందని, రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు త్వరంలోనే జమ అవుతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏటా మే 31వ తేదీలోపు వార్షిక కౌలు జమ అయ్యేలా చూడాల్సిన ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఉమ్మడి బాధ్యతను ఎత్తిచూపుతూ శ్రీనివాసరావు తరఫు న్యాయవాది కోర్టులో కీలక అంశాన్ని లేవనెత్తారు.
సీఆర్‌డీఏ స్పందిస్తూ.. రైతులకు వార్షిక కౌలు చెల్లింపునకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు పంపిణీకి అనుమతిని మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ సమాచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే కౌలు నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments