News

రైతులకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది ఆరోజే?

Gokavarapu siva
Gokavarapu siva

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 14వ విడత కోసం రైతులు ఆశక్తిగా ఎదురుచుస్తున్నారు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ 13వ విడతను విడుదల చేసారు , మీడియా కథనాల ప్రకారం ఇప్పుడు రైతుల నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడనుంది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 14వ విడత విడుదల కానుంది.

రైతులందరికీ మోడీ ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి కనీస ఆదాయ మద్దతుగా రూ.6,000 అందిస్తుంది. ఫిబ్రవరి 1, 2019న 2019 మధ్యంతర కేంద్ర బడ్జెట్ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పీఎం-కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

PM-కిసాన్ వార్షిక వ్యయం రూ.75,000 కోట్లు. ఈ పథకంలో ప్రతి రైతుకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6000, నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి. దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.16,000 కోట్లు పంపిణీ చేసింది.

అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..

ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వరదలు ..

వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఈ జులై నెల 15వ తేదీ కళ్ళ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కావలసి ఉంది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో కచ్చితంగా చెప్పడంలేదు.

అయితే మరి కొన్ని నివేదికల ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఈ నెల చివరి కల్లా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది. అందువల్ల ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.

రైతులు PM-KISAN పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అలా చేయడానికి, రైతులు pmkisan.gov.inని సందర్శించి, హోమ్ పేజీలోని 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్' ఎంపికను ఎంచుకోవాలి. వారు తమ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్‌ని చూడటానికి వారి రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసి, 'డేటా పొందండి'పై క్లిక్ చేయాలి.

ఇది కూడా చదవండి..

ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వరదలు ..

Share your comments

Subscribe Magazine

More on News

More