News

ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వరదలు ..

Srikanth B
Srikanth B
ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వరదలు ..
ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వరదలు ..

దక్షిణాది రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి . భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ సహా హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ రాష్ట్రాలలో గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవనాలు, ఇండ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అయింది .హిమాచల్ లో అయితే వరదలకు కొట్టుకొచ్చినా బురదతో కాలనీలు నిండిపోయాయి.

రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 10 నుండి 'రైతు బీమా' పథకానికి దరఖాస్తులు ప్రారంభం..

ఇప్పటికే కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర వర్షం సంబంధిత ఘటనల్లో ఉత్తరాది రాష్ట్రాలలో 60 మందికి పైగా మరణించినట్టు సమాచారం . యూపీలో 34 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండచరియలు విరిగిపడటం కారణంగా నలుగురు, వరదలు కారణంగా 17 మంది మరణించారు. వరదల కారణంగా ఉత్తరాది రాష్ర్టాల్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. హర్యానా నుంచి వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యమున నదిలో నీటి మట్టం 206 మీటర్లు దాటితే, సమీప లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు.

వర్ష విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు అధికారులు వెల్లడించారు.

రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 10 నుండి 'రైతు బీమా' పథకానికి దరఖాస్తులు ప్రారంభం..

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine