News

రైతులకు శుభవార్త.. నేటి నుండి రైతు భరోసా నిధులు జమ..

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణలో నివసిస్తున్న 72 లక్షల మంది రైతు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్తను అందించి వ్యవసాయ వర్గాల్లో ఆశావాదాన్ని నింపారు. యాసంగి కోసం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతు బంధు నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి రైతుబంధు నుండి రైతు భరోసాగా నామకరణం చేసింది.

పేరు ఏదైనా సరే..నిధులు రావడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేటి నుంచి నగదు జమ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఒకే రోజున కానప్పటికీ, క్రమంగా రైతుల వ్యక్తిగత ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకే రైతులు తమకు డబ్బు వచ్చిందో లేదో అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.

అయితే ఎన్నికల సమయంలో రైతుబంధును కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రైతుబంధును ఆపాలని మొదట ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈసీని అనుమతి కోరగా, రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుంది. అలా రైతుబంధు నిధులు నవంబర్‌లో జమ కాకపోవడానికి కారణమైంది.

ఇది కూడా చదవండి..

బస్‌ కండెక్టర్‌ మహిళకు టికెట్‌ కొట్టి డబ్బులు వసూల్‌! ఉద్యోగం తిలగించిన టీఎస్‌ఆర్టీసీ

ఇక తెలంగాణలో మొత్తం 72లక్షల రైతు కుటుంబాలకు ఈ డబ్బు ఇస్తోంది సర్కార్. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పెద్దగా డబ్బు లేనప్పటికీ…రైతులకు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉన్న డబ్బును రైతుల అకౌంట్లో జమ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రైతు భరోసాకి కేటాయిస్తూ..రైతుల అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందించలేదు. అందుకే ప్రస్తుతానికి రైతు బంధు పథకం ప్రకారం…రైతుల ఖాతాల్లో రూ. 5వేల చొప్పున వేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ విషయంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగుతుందని, రైతు రుణమాఫీకి రూ. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా రుణమాఫీని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, గ్రామీణ మరియు షెడ్యూల్డ్ బ్యాంకుల నుండి పంట రుణం తీసుకున్న రైతు కుటుంబాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనుంది.

ఇది కూడా చదవండి..

బస్‌ కండెక్టర్‌ మహిళకు టికెట్‌ కొట్టి డబ్బులు వసూల్‌! ఉద్యోగం తిలగించిన టీఎస్‌ఆర్టీసీ

Related Topics

raithu bandhu funds deposit

Share your comments

Subscribe Magazine

More on News

More