News

బస్‌ కండెక్టర్‌ మహిళకు టికెట్‌ కొట్టి డబ్బులు వసూల్‌! ఉద్యోగం తిలగించిన టీఎస్‌ఆర్టీసీ

Gokavarapu siva
Gokavarapu siva

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. శనివారం నుంచి ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు రవాణాను అందిస్తుంది. మహిళలు టికెట్ కొనుగోలు అవసరం లేకుండా ఆర్డినరీ మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. మహిళలు టికెట్‌ లేకుండా ఉచితంగా ఎన్నిసార్లైనా ప్రయాణించొచ్చు. దీంతో ఈ పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చింది.

అయితే ఈ పథకంలో ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నప్పటికీ కండక్టర్ మహిళకు టిక్కెట్టు మంజూరు చేయడంపై ఇటీవల వివాదం నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికలపై తీవ్ర దుమారం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో టిఎస్‌ఆర్‌టిసి బస్‌ కండక్టర్‌ నర్సింహులు ఓ మహిళా ప్రయాణికురాలికి టికెట్‌ జారీ చేశాడు. ఆ మహిళా వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.90 ఛార్జీ వసూలు చేశాడు.

ఓ ప్రయాణికుడు కండక్టర్ ప్రవర్తనను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ దృష్టికి వెళ్ళింది, ఆయన వెంటనే సీరియస్‌గా స్పందించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఎండీ సజ్జనార్ వెంటనే కండక్టర్‌ను సస్పెండ్ చేసి ఘటనపై విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..

పెంచిన రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ చేసేది ఎప్పుడు?.. ప్రభుత్వానికి హరీష్‌ రావు ప్రశ్న

అంతేకాకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ వారి వయస్సుపై ఎలాంటి పరిమితులు లేకుండా ఉచిత ప్రయాణం కల్పించాలని ఆయన అన్నారు, ఇందుకోసం ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలని తెలిపారు. పథకం ప్రారంభమైన మొదటి వారం రోజులు మాత్రం ఎటువంటి గుర్తింపు కార్డు లేకున్నా మహిళలు ప్రయాణించొచ్చని వెల్లడించారు.

అయితే పైన పేర్కొన్న కండక్టర్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఆర్‌ఎం జానిరెడ్డి మీడియాకు తెలిపారు. ఉచిత ప్రయాణ కార్యక్రమం ప్రారంభమైన రెండో రోజున నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సు కండక్టర్ మహిళా ప్రయాణికురాలి నుంచి డబ్బులు స్వీకరించి టిక్కెట్‌ను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..

పెంచిన రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ చేసేది ఎప్పుడు?.. ప్రభుత్వానికి హరీష్‌ రావు ప్రశ్న

Share your comments

Subscribe Magazine