News

రైతులకు గుడ్ న్యూస్.! ఆరోజునే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా పరివర్తన చెందుతున్నాయి, ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి తనకు అధికారం కట్టబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ పథకాల అమలుపై సీఎం జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్తను అందించింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా వారికి ఆర్ధిక సాహాయాన్ని అందిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ నవంబర్ నెల 7వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సహాయాన్ని రైతులకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి పుట్టపర్తి కేంద్రంగా వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధుల విడుదలకు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 13,500 సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో 2023-24 ఆర్థిక సవంత్సరానికి తొలి విడత సాయం రూ. 7,500 రైతులకు ఇప్పటికే అందింది. అయితే రెండో విడత సాయాన్ని నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.31,005 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..

ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటంటే?

పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో అర హెక్టారులోపు 1.25ఎకరాల్లోపు ఉన్న రైతులు 60శాతం మంది ఉన్నారు. రైతుల్లొ రెండున్నర ఎకరాల్లోపు ఉన్న వారు 70శాతం వరకు ఉన్నారు. రూ.13,500 పెట్టుబడి సాయం అరవై శాతం రైతులకు 80శాతం పంటలకు 80శాతం పెట్టుబడి సహాయంగా ఉపయోగ పడుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని చెప్పారు.

RBK వ్యవస్థ అపూర్వమైన స్థాయిలో ప్రతి గ్రామంలో అమలు చేయబడింది, సహాయం అందించడానికి గ్రామ స్థాయిలో మొత్తం 10,778 RBKలను ఏర్పాటు చేశారు. ఈ RBKలు రైతులకు బ్యాంకింగ్ సేవలు మరియు కియోస్క్‌ల ద్వారా కల్తీ లేని విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తాయి. ఈ క్రాప్ నమోదు చేసి ఏ ఎకరాలో ఏ పంట వేశారనేది కూడా నమోదు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం రైతులందరికీ లబ్ధి చేకూర్చడమే కాకుండా, కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగుచేసుకుంటున్న వారికి కూడా లబ్ధి చేకూరుస్తోంది.

ఇది కూడా చదవండి..

ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటంటే?

Share your comments

Subscribe Magazine