News

రేషన్ కార్డ్ దారులకు శుభవార్త .. బియ్యం బదులు డబ్బులు.. ఎక్కడంటే?

Srikanth B
Srikanth B



రేషన్ బియ్యాన్ని ఉపయోగించని కొందరు రేషన్ కు బదులుగా కొన్ని డబ్బులు అయినా ఇస్తే బాగుటుంది అనుకుంటారు అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం రేషన్ పొందని లబ్దిదారులకు రేషన్ కు బదులుగా డబ్బులను ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఇది మన రాష్ట్రము లో అయితే కాదు రేషన్ కు బదులుగా డబ్బులు ఇవ్వడానికి కారణం ఏమిటో మనం ఇక్కడా తెలుసుకుందాం !

కేరళ రాష్ట్రంలో రేషన్ అందించే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణముగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రేషన్ బియ్యాన్ని అందించలేక పోయింది దీనితో కేరళ రాష్ట్ర ఆహార కమిషన్ పింక్, పసుపు రంగు రేషన్ కార్డు లబ్ది దారులకు రేషన్ బదులుగా డబ్బు చెల్లించాలని ఆదేశించారు. E-POS వ్యవస్థ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణమా ఏప్రిల్‌నెలలో రేషన్ పొందని లబ్దిదారులకు రేషన్ కు బదులుగా డబ్బులను ఇవ్వనున్నట్లు సమాచారం .

అధికారిక అంచనా ప్రకారం, ఏప్రిల్‌ నెలలో 2.66 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ పొందలేక పోయారు దీనితో రేషన్ పొందని లబ్దిదారులకు 1.25 రెట్లు ధరతో నగదు రూపంలో డబ్బులను అందించనున్నారు ఈ ఆహార భత్యం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం లెక్కించనున్నారు.

ఇది కూడా చదవండి .

రానున్న రోజులలో భారీగా తగ్గుతున్న వంట నూనె ధరలు..!



కేరళ రాష్ట్రంలో మొత్తం 41.43 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 35.58 లక్షల మంది కి గులాబీ కార్డుదారులు , 5.85 లక్షల మంది పసుపు కార్డుదారులు ఉన్నాయి వీరిలో 38.77 లక్షల మంది కార్డుదారులు ఏప్రిల్‌లో రేషన్ పొందారు. అదేవిధంగా ఫిబ్రవరిలో 39.65 లక్షల మంది, మార్చిలో 39.57 లక్షల మంది కార్డు లబ్ధిదారులు మాత్రమే రేషన్ బియ్యాన్ని పొందారు .

అయితే ఇప్పటివరకు లబ్ది పొందని రేషన్ కార్డు లబ్దిదారులకు డబ్బులను అందించనున్నారు .

ఇది కూడా చదవండి .

రానున్న రోజులలో భారీగా తగ్గుతున్న వంట నూనె ధరలు..!

Related Topics

Free ration

Share your comments

Subscribe Magazine

More on News

More