News

రానున్న రోజులలో భారీగా తగ్గుతున్న వంట నూనె ధరలు..!

Srikanth B
Srikanth B
cooking oil price will reduce in coming days
cooking oil price will reduce in coming days

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు శుభవార్త .. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినా వంటనూనె ధరలు దీనితో త్వరలో దేశీయంగా కూడా భారీగా తగ్గనున్నాయి , యుక్రెయిన్ -రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి అధిక మొత్తం లో ఉత్పత్తి అయ్యే సన్ ఫ్లవర్, సొయా నూనెల సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనితో అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకాయి.

ఇప్పుడు యుక్రెయిన్ నుంచి నూనెల సరఫరా అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. 2022తో పోలిస్తే ధరలు 46 నుంచి 57 శాతం వరకు తగ్గాయి.అయితే తగ్గినా ధరల ప్రయోజనాలు సామాన్యులకు అందాలంటే ఇంకా కొద్దీ రోజులు పట్టవచ్చు .


యుక్రెయిన్ ఉత్పత్తి చేసే ముడి సన్‌ఫ్లవర్ నూనె ధర టన్నుకు ప్రస్తుతం రూ. 81,300గా ఉంటే , టన్ను ముడి పామాయిల్ ధర రూ. 82 వేలు , సోయాబీన్ ఆయిల్ ధర రూ. 85,400గా దీని ప్రకారం చూస్తే సోయాబీన్, పామాయిల్ ధరల కంటే సన్‌ఫ్లవర్ నూనె ధర చాల తక్కువగా వుంది రానున్న రోజులలో ఈధరలు మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు దీనితో రానున్న రోజులలో వంట నూనె ధరలు భారీగా తాగనున్నాయి .

ఇది కూడా చదవండి .

సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవసరానికి సరిపోయేంతగా ఉందని SEAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా ప్రముఖ మీడియా సంస్థలకు వెల్లడించారు. కానీ రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాస్త సమయం పట్టినా ధరలు మాత్రం తగ్గనున్నాయి.ప్రస్తుతం వున్నా ధరలతో పోలిస్తే తగ్గినా ధరలు అమలులోకి వస్తే 15 -20 శాతం వరకు వంట నూనె ధరలు తగ్గనున్నాయి, తగ్గినా ధరలు త్వరగా అమలులోకి రావాలని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు .

ఇది కూడా చదవండి .

Share your comments

Subscribe Magazine