Health & Lifestyle

పెరుగు మరియు యోగర్ట్ మధ్య తేడా ఏమిటి? అసలు ఏది మంచిది..

Gokavarapu siva
Gokavarapu siva

సాధారణంగా పెరుగు తెలియని వారు అంటూ ఉండరు. చాలా మంది ప్రజలు పెరుగుని చాలా ఇష్టంగా తింటారు. దీనితో పాటు మీరు యోగర్ట్ అనే పేరు కూడా వినే ఉంటారు.పెరుగుని వేరే దేశాల్లో యోగర్ట్ అంటారు అని అనుకుంటారు. కానీ చాలా మందికి ఈ రెండిటికి మధ్య తేడా తెలియదు. రెండు ఒకటే అంటుకుంటారు, కానీ ఒకటి కాదు.

పెరుగు మరియు యోగర్ట్ రెండు కూడా పాలతో తయారు చేసే ఉత్పత్తులే అయినగాని ఆ రెండిటికి రుచిలోనూ మరియు పోషకాల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. పెరుగుని మనం సహజంగా ఇంట్లోనే చేసుకుంటాం, ఇదే విధంగా యోగర్ట్ని ఇంట్లో చేసుకోలేం. యోగర్ట్ ని కృత్రిమంగా తయారు చేస్తారు.

పెరుగు సంగతికి వస్తే దానికి ఎలా తయారు చేయాలో మనకి తెలుసు. పాలను బాగా కాచిన తరువాత చల్లారనివ్వాలి. ఆ తరువాత దానిలో కొంచెం పెరుగు వేస్తే, కాసేపటికి పాలు పెరుగుగా మారిపోతాయి. ఇలా జరగడానికి పెరుగులో ఉండే ఒక బాక్టీరియా కారణం. అందులో ఉండే ఆ బాక్టీరియానే పాలను పెరుగుగా మారుస్తుంది. మరి కొంతమంది ఐతే పాలలో వెనిగర్ లాంటివి వేసి కూడా తయారు చేస్తున్నారు.

కానీ యోగర్ట్ ని ఇలా మనం చేయలేము. దీనిని కృత్రిమంగా చేస్తారు. యోగర్ట్ ని తయారు చేయడానికి కృత్రిమ యాసిడ్స్ వాడతారు. ఈ రెండింటిలోనూ బాక్టీరియా ఉన్నపటికీ యోగర్ట్ లో పెరుగు కంటే ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. పెరుగులో ప్రత్యేకించి ఒక బాక్టీరియా అంటూ ఉండదు, ఇది అన్ని రకాల సూక్ష్మ భాసితేరియాలను కలిగి ఉంటుంది. కానీ యోగర్ట్ తయారు చేయడానికి ప్రత్యేకించి ఒక బాక్టీరియా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి..

80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం! ఉచిత శిక్షణ

కొంతమందికి పెరుగులో ఉండే లాక్టోస్ బాక్టీరియా పడదు, వారికి అలర్జీ వంటికి వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు పెరుగుకు బదులుగా యోగర్ట్ తినవచ్చు. వారికి ఎటువంటి అలర్జీ రాదు. అందులోనూ గ్రీక్ స్టైల్ యోగర్ట్ వారికి సరిగ్గా సెట్ అవుతుంది. గ్రీక్ యోగర్ట్ మందంగా ఉంటుంది.

యోగర్ట్ లో పెరుగుల ఒకే రుచి కాకుండా, దానిని చేసినప్పుడు వివిధ రకాల పండ్ల ఫ్లేవర్స్ అంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాక్లెట్ ఫ్లేవర్ ఇలా కలుపుతారు. దీనివల్ల యోగర్ట్ కి రుచి బాగా పెరుగుతుంది. రెండిటిలో ఏది మంచింది అంటే పెరుగు తినడం వలన మన శరీరంలో వేడిని తగ్గించి, చలువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు యోగర్ట్ లో పెరుగు కన్నా డబుల్ ప్రోటీన్స్ లభిస్తాయి.

రెండిటిలో ఒకటి ఎంచుకోవాలి అంటే కనుక అప్పుడు పెరుగు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగర్ట్ ఎక్కువ తినడం వలన బరువు పెరుగుతారు. అంతే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పెరుగులో కాల్షియం అనేది అధిక శాతం లభిస్తుంది. ఈ కాల్షియం అనేది మన ఎముకలు, దంతాలకు బలం చేకూరుస్తుంది. యోగర్ట్ మరియు పెరుగులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇందువలన ముసలివారిలో కీళ్లనొప్పులు, అస్థియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

ఇది కూడా చదవండి..

80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం! ఉచిత శిక్షణ

Related Topics

curd yogart

Share your comments

Subscribe Magazine