ఆంధ్రప్రదేశ్‌లో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకం యొక్క నిధులను విడుదల రేపే అనగా ఈ ఆగష్టు 28న విద్యార్థుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన మూడో త్రైమాసిక నిధుల విడుదలను ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పర్యవేక్షిస్తారని నిర్ధారించారు.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన అనేది ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ మరియు ఇతర కోర్సులను అభ్యసించే విద్యార్థులకు మొత్తం ఫీజులను తిరిగి చెల్లించే పథకం.
ఇందులో భాగంగానే రేపు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి కి చేరుకుంటారు సీఎం జగన్. విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థుల ఫీజుల మొత్తాన్ని విడదల వారీగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు.. పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షలు.. రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, మరియు జగనన్న వసతి దీవెన, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ మరియు పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసించే అర్హతగల విద్యార్థులకు బోర్డింగ్ మరియు లాడ్జింగ్ ఖర్చులను అందించే మరో పథకం కోసం రూ.14,912 కోర్ ఖర్చు చేసింది.
ఇది కూడా చదవండి..
Share your comments