News

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..ఇకనుండి ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీ..

Gokavarapu siva
Gokavarapu siva

తృణధాన్యాల్లో రాగికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాగిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ అధిక పోషకాలు కలిగిన రాగుల యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలిసేలా ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రాగిజావను అందించనుంది.

రాగిజావను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించడంతో తెలంగాణ విద్యార్థులకు ఆశాజనకమైన వార్త అందింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ అడుగుజాడలను అనుసరిస్తుంది, ఇక్కడ ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 16.82 లక్షల మంది విద్యార్థులకు రాగు జావను అందించనున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి..

భారీగా పెరిగిన కందిపప్పు ధర.. కిలో ఎంతో తెలుసా?

ఇప్పటికే పాఠశాలల్లో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందేలా ప్రభుత్వం మధ్యాహ్న భోజనలను అందిస్తుంది. ఏటా 110 రోజుల పాటు మధ్యాహ్న భోజనం అందించే ప్రధానమంత్రి పోషణ్ పథకం అమలుకు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమానికి అంచనా వ్యయం రూ. 27.16 కోట్లు, కేంద్రం సహకారంతో రూ. 16.18 కోట్లు మరియు రాష్ట్రం రూ. 11.58 కోట్లు. ఈ నిర్ణయానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇప్పటి పిల్లల్లో ఎక్కువగా కాల్షియమ్, ఐరన్, వంటి పోషక లోపాల వలన వారిలో రక్తహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ఐరన్ మరియు కాల్షియమ్ అనేది రాగిలో అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల్లో ఈ సమస్యలను నివారించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఈ రాగిజావను అందిందనున్నారు.

ఇది కూడా చదవండి..

భారీగా పెరిగిన కందిపప్పు ధర.. కిలో ఎంతో తెలుసా?

Share your comments

Subscribe Magazine