2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో 28 సీట్లను పెంచాలని వర్శిటీ మండలి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పూర్తి వివరాలు చుస్తే వ్యవసాయ కళాశాలలు అందిస్తున్న వివిధ విద్యా కోర్సుల్లో వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ డిగ్రీ,వ్యవసాయ ఇంజనీరింగ్,ఫుడ్ టెక్నాలజీ, బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్ మరియు వ్యవసాయ ఎం ఎస్సి వంట కోర్సుల్లో సీట్లను పెంచబోతున్నారు. ఇది కచ్చితంగా వ్యవసాయ లో డిగ్రీ చేయాలనుకుంటున్న విద్యార్థులందరికి శుభవార్త.
మిగితా విద్య కోర్సులతో పరిగణిస్తే వ్యవసాయ డిగ్రీలో సీట్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్కువగా విద్యార్థులు అందరు వ్యవసాయ డిగ్రీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి చూపుతున్న విద్యార్థులు సంఖ్యకి మరియు అందుబాటులో ఉన్న సీట్ల నిష్పత్తి చాలా తక్కువ ఇలాంటి సమయంలో ఈ వార్త వ్యవసాయ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులకి కొంత వరకు ఉపశమనమే అని చెప్పాలి. తెలుగు రాష్టాలలో సీట్లు దక్కని విద్యార్థులు ఉత్తర రాష్టాలకి వెళ్లి వ్యవసాయ విద్యని అభ్యసిస్తున్నారు వీరి సంఖ్య అధికంగానే ఉన్నట్లు సమాచారం
ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిణిది లో ఉన్న కళాశాలలు:
1.కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
2. వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం Dt.
3. వ్యవసాయ కళాశాల, జగిత్యాల Dt.
4. వ్యవసాయ కళాశాల, పాలెం, నాగర్ కర్నూల్ Dt.
5. వ్యవసాయ కళాశాల, వరంగల్ Dt.
6. వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల Dt.
7. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, కంది, సంగారెడ్డి Dt.
8. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ Dt.
9. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, సైఫాబాద్, హైదరాబాద్.
ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ కోర్సులు.
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్.
- డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్.డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ.B.Sc అగ్రికల్చర్.
- B.Tech ఫుడ్ టెక్నాలజీ.
- B.Sc కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్.
- M.Sc అగ్రికల్చర్.M.Sc అగ్రికల్చర్ బయోటెక్నాలజీ.
- M.Sc ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
- అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ మాస్టర్.
- Ph.D వ్యవసాయం.
మరిన్ని చదవండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యొగం: భారతీయ రిజర్వు బ్యాంకులో(RBI) గ్రేడ్ B ఆఫీసర్ల ఖాళీలు. పూర్తి వివరాలు చదవండి.
Share your comments