News

తెలంగాణ ఉద్యోగ అభ్యర్థులకి శుభవార్త, లక్షమందికి బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్

S Vinay
S Vinay

తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున నియామకాలను చేపట్టిన విషయం తెలిసినదే విద్యా, వైద్య. ఆరోగ్య రంగం,పోలీస్ శాఖ మరియు గ్రూప్స్ విభాగం లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది.

ఇప్పటికే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలకి సిద్ధం అవుతున్నారు కొందరు స్వతహాగా సన్నద్ధం అవుతున్నారు మరికొందరు కోచింగ్ సెంటర్లలో చేరి శిక్షణ తీసుకుంటున్నారు అయితే ఈ తరుణం లో కోచింగ్ సెంటర్లకి వెళ్లలేని పేద అభ్యర్థుల అందరికి శిక్షణ అందేలా బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించడానికి ముందుకు వచ్చింది. ఇది కచ్చితంగా పేద విద్యార్థులకి ఉపయోగపడుతుందని భావిస్తుంది.అయితే దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ ఇవ్వాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. అయితే ఈ లక్ష మందికి శిక్షణా తరగతులని ఆన్లైన్ క్లాసుల ద్వారా నిర్వహించనుంది. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గ్రూప్స్‌, జనరల్‌ స్టడీస్‌, తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలకు సంబంధించి ప్రతిరోజూ 100 ప్రశ్నలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతుంది.యూట్యూబ్‌ ద్వారా గ్రూప్స్‌, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంక్‌, యూపీఎస్సీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి దాదాపు 300కు పైగా వీడియోలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది టెలిగ్రామ్‌ ద్వారా కూడా ఉద్యోగార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందించేందుకు బీసీ స్టడీ సర్కిల్‌ చర్యలు చేపట్టింది.ఫేస్‌బుక్‌ ద్వారా కూడా వీడియో పాఠాలను అందించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ఉద్యోగ అభ్యర్థులకు కోసం బీసీ స్టడీ సర్కిల్‌ ప్రత్యేకంగా యాప్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది.

అయితే ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరు సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. కోచింగ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కాబట్టి పేద విడీర్థులు అందరు తప్పకుండ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని చదవండి.

TS EAMCET 2022 :నోటిఫికేషన్ విడుదల!

Share your comments

Subscribe Magazine