News

గుడ్ న్యూస్.. వైఎస్సార్‌ షాదీ తోఫాలో కీలక మార్పులు.. ఈ పథకానికి వారు కూడా అర్హులే !

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న దూదేకుల, నూర్బాషా, పింజారి, లద్దాఫ్‌ కులాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుండి ఈ కులాల వారికి కూడా ప్రభుత్వం అందించే YSR షాదీ తోఫా కార్యక్రమం వర్తిస్తుందని ప్రభుత్వం సర్కులర్ ను జారీ చేసింది.

రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లింలకు ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాన్ని అమలు చేసింది. రాష్ట్రంలోని నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్‌ కులస్తులకు కూడా ఇకపై వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్‌ కులస్తులను బీసీ-బీగా పరిగణిస్తుండటంతో వారికి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని దూదేకుల సంఘం ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ను సంప్రదించారు.

ఇది కూడా చదవండి..

సామాన్యులకు షాక్.. దేశంలో భారీగా పెరిగిపోతున్న పప్పు ధరలు..

వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వారు కోరిన మొత్తాన్ని మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆనందపరిచింది. ఇంకా, ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను విస్తరించడానికి, డూడెక్‌లను ముస్లింలుగా వర్గీకరించడానికి మరియు వారు అర్హులైన ప్రయోజనాలను పొందుతారని హామీ ఇవ్వాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

ఇది కూడా చదవండి..

సామాన్యులకు షాక్.. దేశంలో భారీగా పెరిగిపోతున్న పప్పు ధరలు..

Share your comments

Subscribe Magazine