దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ, అదేమిటంటే దేశంలోని ప్రజలందరికీ మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం రీఛార్జ్ ఫ్రీగా ఇస్తుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు సంబంధించి కేంద్రప్రభుత్వ వర్గాలు స్పందించి క్లారిటీ అందించాయి.
ఐదు రాష్ట్రాలలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కొనసాగుతుండగా, వచ్చే ఏడాది అనేక ఇతర రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఈ ఎన్నికల దృశ్యంతో, రాజకీయ పార్టీలు కొత్త పథకాలను ఆవిష్కరించడానికి మరియు ఓటర్ల మద్దతును పొందేందుకు తమ ప్రయత్నంలో వాగ్దానాలు చేయడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ రీఛార్జ్ గోల మొదలయ్యింది.
ఇది కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్.. రేపే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ..
కేంద్ర ప్రభుత్వం నుండి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2024 ఎన్నికలలోపు ఉచిత రీఛార్జ్ యోజన అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని బిజెపి ప్రభుత్వం యోచిస్తోందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని తెలిపారు.
ఆన్ లైన్ మోసాలు చేసేవారు ఇలాంటి వాటిని ఎక్కువ క్రియేట్ చేస్తారని..ఫ్రీ రీఛార్జ్ పేరుతో ఏమైనా లింక్స్ వస్తే దానిని పూర్తి బ్లాక్ చేసుకుంటే మంచిదని తెలిపింది. ఈ సందేశం విస్తృతంగా వ్యాపించడంతో కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మెసేజ్‌ను పరిశీలించిన అధికారులు అందులో నిజం లేదని తేల్చేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments