టమాటో ధర పెరుగుదల తరువాత దేశంలో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని వివిధ మార్కెటింగ్ నిపుణుల విశ్లేషణ అనంతరం కేంద్ర ఉల్లి ధరలను నియంత్రణలో ఉంచడానికి ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి పన్ను విధించింది దీనితో ఇతర దేశాలకు ఎగుమతి తగ్గి ఉల్లి ధరలు తగ్గనున్నాయి అయితే ఎంతవరకు బాగానే వున్నా రైతులకు ఈ నిర్ణయం చాల నష్టాన్ని కల్గించనుంది.
ఎపుడో ఒకేసారి ధర పెరిగి లాభాలు పొందాలనుకునే రైతులకు కేంద్ర నిరన్యం వాళ్ళ ధరలు అదుపులో ఉంటాయి టీదినితో రైతులు తీవ్రగా నష్టపోనున్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నిన్న మహారాష్ట్ర రైతులు ధర్నా నిర్వహించారు మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ' ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు' అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది.
ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటన చేసారు . అయితే రూ.2,410 క్వింటాల్‌కి ఇస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందా వచ్చిన ఒక అవకాశాని రైతులు వినియోగించకుండా కేంద్రం రైతుల నోట్లో మట్టి కొట్టిందని వాపోతున్నారు రైతులు
ఇది కూడా చదవండి.
Share your comments