News

రేషన్ కార్డ్ అప్‌డేట్: రేషన్ కార్డు వినియోగదారులకి శుభవార్త ఆధార్ & రేషన్ కార్డ్ లింక్ కోసం చివరి తేదీ పొడగింపు.

S Vinay
S Vinay

కేంద్ర ప్రభుత్వం ఆధార్ & రేషన్ కార్డ్ లింక్ కోసం చివరి తేదీని పొడిగించింది. దీనికి సంబంధించి కొత్త తేదీలను తెలుసుకోండి.

ఆధార్-రేషన్ లింక్ : రేషన్ కార్డు వినియోగదారుల కోసంఈ సమాచారం. ప్రభుత్వం వినియోగదారులకి మరొక అవకాశం కలిపిస్తూ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది. దీనికి సంబంధించి ఆహార, ప్రజాపంపిణీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముందుగా ఆధార్ ని రేషన్ కార్డు తో అనుసంధానం చేయడానికి చివరి తేదీ 31 మార్చ్ 2022 గా పేర్కొన్నారు. కానీ ప్రజల అవసరాల దృష్ట్యా మేరకు దీనిని 30 జూన్ 2022 వరకు పొడిగించారు. మీరు మీ రేషన్ కార్డ్‌ని ఇంకా ఆధార్‌తో లింక్ చేయకుంటే అధికారిక వెబ్సైటు లోకి వెళ్లి పూర్తి చేసుకోండి.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని ఇలా లింక్ చేయండి:
దీని కోసం, ముందుగా అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.

ఇప్పుడు మీరు 'Start Now' పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీరు మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోండి.

దీని తర్వాత 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఇ-మెయిల్ , మొబైల్ నంబర్ మొదలైనవాటిని నమోదు చేయండి.తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

OTPని నమోదుచేయండి.

ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే, మీ రేషన్ కార్డుతో మీ ఆధార్ లింక్ చేయబడుతుంది.

రేషన్ కార్డు వినియోగదారులకి తక్కువ ధరతో పాటు నిత్యావసర వస్తువులు లభిస్తాయి.కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని ప్రారంభించింది. దీని కింద దేశంలో లక్షలాది మంది ప్రయోజనాలు పొందుతున్నారు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా మీరు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ పొందవచ్చు.

మరిన్ని చదవండి.

పొలంలో కోతుల బెడద.రైతు వినూత్న ప్రయోగానికి శ్రీకారం.

Share your comments

Subscribe Magazine