News

చెక్కెర ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం..... కారణాలు ఇవే....

KJ Staff
KJ Staff

తాజాగా ప్రభుత్వం చెక్కర ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం అక్టోబర్ వరకు కొనసాగుతుందని పేర్కొంది. దేశంలో చెక్కర వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత అత్యంత ఎక్కువ చెక్కర ఉత్పత్తి చేసే దేశం భారత దేశం. ఇక్కడ ఉతపతైనా చెక్కర బాంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, సౌదీ అరేబియా, వంటి దేశాలు దిగుమతి చేసుకుంటాయి.

ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని పలు షుగర్ మిల్స్ యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఉతప్తి ఆశించినదానికన్నా ఎక్కువ ఉత్పత్తి ఉండబోతుందని, కనుక ఈ నిషేధాన్ని ఎత్తివేయ్యాలి అని భరత్ షుగర్ మిల్స్ అసోసియేషన్(ISMA) ప్రభుత్వాని కోరింది. కనీసం 10 లక్షల టన్నుల టన్నుల చెక్కర ఎగుమతి చెయ్యగలిగేలా అనుమతినిస్తే తమకు లభిస్తుందని కోరింది. ఈ ఏడాది మార్చ్ నెల నాటికీ దేశంలో చెక్కర 30 మిల్లియన్ టన్నులుగా ఉంది, ఈ సీసన్ ముగిసే సమయానికి 32 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి జరగచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిషేధాన్ని ఎత్తేసేది లేదని తేల్చి చెప్పింది.

అయితే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెంచే దిశలో చెక్కర ఎగుమతులపై ఈ నిషేధం విధించినట్లు తెలుస్తుంది. అధికంగా వినియోగిస్తున్న శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి. బయోఇథనాల్ శిలాజ ఇంధనలతో కలిపి వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. 2025 నాటికీ శిలాజ ఇంధనాల్లో 20% బయో ఇథనాల్ ఉపయోగించే దిశగా ప్రభుత్యం చర్యలు తీసుకుంటుంది. చెక్కెర ఉతప్తిలో బి-మొలాసిస్ అని పిలవబడే సహజ స్వీటీనేర్ ఇథనాల్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది. ఈ ఏడాది అదనంగా మిగిలిన బి-మొలాసిస్ తో ఇథనాల్ ఉత్పత్తి చెయ్యాలని షుగర్ మిల్లులను ప్రభుత్వం ఆదేశిస్తుంది.

Share your comments

Subscribe Magazine