ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని ఏ వార్త నమ్మాలో .. ఏ వార్త నమ్మకూడదో జనాలకు అర్ధం కావడం లేదు, కొందరు సోషల్ మీడియాలలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మి నిలువునా మోసపోతున్నారు , వాట్సాప్ లో వచ్చే లింక్ లను క్లిక్ చేసి లక్షలు పోగుట్టుకుంటున్నారు ఇటీవల ఇలాంటి సంఘటనలు పెరిగి పోతున్నాయి .
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ రీఛార్జ్ చేస్తుంది అంటూ గత వారం రోజుల నుంచి ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అయితే ఈవార్త ఎంతవరకు నిజం అనేది మనం ఏ కధనం లో తెలుసుకుందాం .
గత రెండు వారాల నుంచి వాట్సాప్ లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్ స్కీం ద్వారా మొబైల్ ఫోన్ లు ఉచితంగా రీఛార్జ్ చేస్తుంది అన్నట్లు ఒక వార్త తెలగ చక్కర్లు కొడుతుంది .. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా నెల రోజులు ఉచితముగా రీఛార్జ్ చేస్తుంది అంటూ వార్తలపై PIB ఫాక్ట్ చెక్ నిర్వహించింది ఈ అంశం పై కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించి ఇటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపింది ప్రజలు ఇలా వచ్చే లింక్ లపై క్లిక్ చేసి మోసపోవద్దని సూచించింది.
ఇది కూడా చదవండి.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడ్రోజుల పాటు వర్షాలు..
ఎలా పథకాల కు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు వున్నా PIB ఫాక్ట్ చెక్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది .. కావున ప్రజలు ఏ వార్తను నమ్మవద్దని సూచించింది .
Share your comments