News

రైతులకు శుభవార్త ; క్వింటాల్‌కు 15 వేలు పలుకుతున్న పసుపు 

Srikanth B
Srikanth B
రైతులకు శుభవార్త ; క్వింటాల్‌కు 15 వేలు పలుకుతున్న పసుపు
రైతులకు శుభవార్త ; క్వింటాల్‌కు 15 వేలు పలుకుతున్న పసుపు

ఈ నెల రైతులకు కాస్త సంతృప్తి కరమైన లాభాలనే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు .. టమాటో , అల్లం , ఉల్లి , మిర్చి పంట పండించిన రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కాయి. ఇప్పుడు టమాటో తరువాత పసుపు కు టైం వచ్చింది గతంలో ఎప్పుడు రాని  ధర ఇప్పుడు రావడంతో రైతులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నెల రోజుల కింద ఐదు వేల నుంచి ఏడు వేలు పలికిన పసుపు ధర ఇప్పుడు ఏకంగా ధర మాత్రం క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.16వేల మధ్య పలుకుతోంది.దీనితో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికైనా పెరిగిన ధరతో లాభాలు వస్తుండంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

అంతర్జాతీయంగా మార్కెట్లో  పసుపుకు డిమాండ్‌ పెరగడం, రాష్ట్రంలో పసుపు పంట దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పసుపు ధర ఊహించని విధంగా అమాంతం పెరిగింది. ప్రస్తుతం పసుపు ధరకు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తోపాటు వరంగల్‌లోని ఏనమాములు, కేసముద్రం వ్యవసాయమార్కెట్లలో క్వింటాల్‌ పసుపు ధర రూ. 13 నుంచి రూ.16వేల మధ్య పలుకుతోంది. గడిచిన పదేళ్లలో పసుపు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లోక్వింటాల్‌ కు  రూ.15005 ధర పలికింది. 

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

Related Topics

#blue turmeric

Share your comments

Subscribe Magazine

More on News

More