గత రెండేళ్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, వరుసగా మూడో ఏడాది కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే ఉత్తర భారత మైదాన ప్రాంతం, ఈశాన్య ప్రాంతంలో కొద్దిచోట్ల వర్షపాతం తగ్గే అవకాశంది ఉందని, కర్ణాటక లోని మారుమూల ప్రాంతాలు జులై, ఆగస్టులో వర్షాభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని స్కైమెట్ సంస్థ వెల్లడించింది.
తెలుగు ప్రజలకు. తాజాగా స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతు పవనాలపై అధ్యయనం చేసిన స్కైమేట్. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. రుతుపవన కాలమైన జూన్ నుంచి సెప్టెంబరు మధ్య 103 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతానికి 60 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 15 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణలో చాలా ప్రదేశాలలో పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఎండ వేడిమి ఉన్నా కాస్త చల్లగానే ఉంది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షం కురుస్తోందని తెలియజేశారు. ఇదీ పంటలకు మంచి కాదని అన్నదాత అల్లాడిపోతున్నాడు. చెడగొట్టు వానలతో కీడే జరుగుతోందని వాపోతున్నాడు. కానీ ప్రకృతి మాత్రం రైతన్నపై ఎప్పుడూ కన్నెర్ర చేస్తూనే ఉంది.
Share your comments