News

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గ వేడి గాలులు వీచే అవకాశం -IMD Hyderabad

Srikanth B
Srikanth B

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో, భారత వాతావరణ శాఖ (IMD )-హైదరాబాద్ మంగళవారం రానున్న రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీచేసింది .హెచ్చరిక ప్రకారం , ఏప్రిల్ 26 మరియు ఏప్రిల్ 28 మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది .

రాష్ట్రవ్యాప్తం గ తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షపాతం  నమోదుకు  అవకాశం ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటవచ్చు మరియు 10 జిల్లాలకు లో  45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చు. హైదరాబాద్‌లో, బుధవారం 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య  ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి , గురు మరియు శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు   41 నుండి 45 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం వున్నది .“తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 ° C నుండి 4 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉంది అని ,” IMD పేర్కొంది.

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్‌,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో గరిష్టం గ ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉన్నట్టు  తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణ: EAMCET ర్యాంకుల తో BSc నర్సింగ్ లో ప్రవేశాలు !

Related Topics

IMD Hyderabad heatwave alert

Share your comments

Subscribe Magazine