News

రానున్న రెండురోజుల్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగ భారీ వర్షాలు..

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయంనుంచి కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులతో కూడిన వాతావరణం ఏర్పడింది ,అక్కడక్కడా చిరుజల్లులాతీతలేకపాటి నుంచి చిరుజల్లు కురిశాయి , కాగా రానున్నరెండు రోజుల్లలో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది . భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద పప్పూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవగా.. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అన్నమయ్య జిల్లాలో కురిసిన భారీ వర్షానికి సంపతికోట వాగు నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులోని కుటుంబసభ్యులను రక్షించిన ఓ యువతి.. ఊపిరాడక చనిపోవడం విషాదకరం.

మేక పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Related Topics

Heavy rain Andhra Pradesh

Share your comments

Subscribe Magazine