News

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు .. యెల్లో , ఆరంజ్ అలెర్ట్ జారీ !

Srikanth B
Srikanth B
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు .. యెల్లో , ఆరంజ్ అలెర్ట్ జారీ !
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు .. యెల్లో , ఆరంజ్ అలెర్ట్ జారీ !

 

తెలంగాణాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి , రానున్న రెండు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది , పలు జిల్లాలకు యెల్లో అలెర్ట్ మరికొన్ని జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది దీనితో రానున్న రెండు రోజుల పటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఆయా ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈజిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ.

అదేవిధంగ తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది.

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!

 

బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!

Related Topics

ap rain alert

Share your comments

Subscribe Magazine

More on News

More