ఇప్పటికే కారణంగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలు , పంట నష్టం తో ఇబ్బంది పడుతుంటే మరోవైపు రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఆవర్తనం ఈశాన్యాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్యలో ఉందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది.
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ
ప్రస్తుతం విస్తరించి వున్నా ఆవర్తనం ప్రభావంతో ఆగస్టు 18వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Share your comments