రెండు తెలుగు రాష్ట్రాలలో గత 2 రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి , వర్షం ధాటికి పంటలు తివారంగా దెబ్బతిన్నాయి , రెండు రాష్ట్రాలలో ముఖ్యంగా మిర్చి పంటకు అకాల వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది , కొని చోట్ల పిడుగుపరుగు ముగా జీవాలు మృత్యువాత పడ్డాయి ,రానున్న 36 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమ్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది .
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, ఈదురుగాలులతో పంటపొలాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 36 గంటలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో బంగాళాఖాతం మీదుగా రాష్ట్రంలోని తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !
వడగళ్ళ వాన సమయంలో రైతులు పాడించాల్సిన జాగ్రత్తలు:
ముందస్తు వడగళ్ళ వాన సూచనలకు రైతులు పాటించ వలసిన యాజమాన్య పద్ధతులు రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో వడగళ్ళ వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున అధిక వర్షపు నీరు బయటికి పోవడానికి ఆరుతడి మరియు కూరగాయ పండించే పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిస్ తో కప్పి వుంచవలెను.
కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోసుకోవాలి.
Share your comments