News

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !

Srikanth B
Srikanth B
Drone pilot license course at Acharya NG Ranga University
Drone pilot license course at Acharya NG Ranga University

Drone Pilot Corse at ANGRAU : వ్యవసాయంలో సాంకేతికతను ,వ్యవసాయ మెళకువలను రైతులకు పరిచయం చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకోసం మరొక ముందడుగును వేసింది , వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుండడంతో నిపుణులైన డ్రోన్ పైలట్లు ఎంతో అవసరం లేనిపక్షంలో ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్లను వాడే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. పంటలు పాడవుతాయి.

అందుకే కొందరు వ్యక్తులు, మరికొన్ని ప్రైవేటు సంస్థలు డ్రోన్ల వాడకంపై శిక్షణ అందిస్తున్నాయి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల వినియోగంపై కొద్దిరోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాగులో డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు చేసి కొన్ని ప్రమాణాలు రూపొందించి. ఈ మేరకు ఈ నెలలో DGCA నుంచి Drone Pilot Corse కోసం (ANGRAU ) ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతులను పొందినది . అనుమతులు పొందిన అనంతరం తన మొదటి Drone Pilot Corse బ్యాచ్ కోసం ANGRAU నోటిఫికేషన్ విడుదలచేసింది ,కేవలం పదవతరగతి అర్హత కల్గినవారు ఈకోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన ANGRAU ఇప్పుడు సంవత్సరం పొడువునా అర్థులైనా వారికీ కోర్సును అందించనుంది , ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన వివరాలు చదివి దరఖాస్తు చేసుకోవచ్చు . ప్రస్తుతం 5 బ్యాచులు తమ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నాయి .

 

Drone Pilot Corse at (ANGRAU) అందించే కోర్సు :

వ్యవసాయ రిమోట్ పైలట్ కోర్సు (ARPC) తో DGCA ధ్రువీకృత RPTO సర్టిఫికేట్ కోర్సు

అర్హత :అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా /10+2

వయోపరిమితి :18-65

కోర్సు ఫీజు :45000

ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు.. కొత్త ఆప్షన్ లపై ప్రత్యేక దృష్టి!

Drone Pilot Corse at (ANGRAU) దరఖాస్తు ప్రక్రియ :
దయచేసి అడ్మిషన్ ఫారమ్‌ను పూరించండి మరియు స్కాన్ చేసిన వాటితో పాటు సర్టిఫైడ్ మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించండి
పత్రాల కాపీలు. సరిగ్గా పూరించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా rptoangrau2022@gmail.comకు పంపాలి
24.11.2022న లేదా ముందు, 5.00 P.M.

దరఖాస్తు / అడ్మిషన్ ఫారంతో పాటు సమర్పించాల్సిన పత్రాలు:


1. CRPC &ARPC కోసం SSC / 10వ తరగతి సర్టిఫికేట్
2. 10+2/ అగ్రిల్ డిప్లొమా / అగ్రిల్.ఇంగ్లీషు. డిప్లొమా / డిగ్రీ సర్టిఫికెట్లు
3. ఏదైనా డ్రోన్ అనుభవ సర్టిఫికేట్
4. CRPC & ARPC కోసం మెడికల్ సర్టిఫికేట్
5. CRPC & ARPC కోసం పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ
6. CRPC & ARPC కోసం ఆధార్ కార్డ్ కాపీ
7. CRPC & ARPC కోసం పాన్ కార్డ్ కాపీ
8. ఉద్యోగి ID కార్డ్, CRPC & ARPC కోసం ఏదైనా ఉంటే
9. సూచించిన ఫార్మాట్‌లో మెడికల్ సర్టిఫికేట్
10. RPTO & లేదా DGCA ఎప్పటికప్పుడు కోరిన ఏదైనా ఇతర సర్టిఫికేట్.
11. పైన పేర్కొన్న అన్ని పత్రాలు అసలైనవి ANGRAU-RPTO కార్యాలయంలో ధృవీకరించబడాలి.

ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు.. కొత్త ఆప్షన్ లపై ప్రత్యేక దృష్టి!

Related Topics

agricultural drones

Share your comments

Subscribe Magazine