ఖరీఫ్ సీజన్లో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి, ఆ సీసన్ లో వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది. వర్షాలు అధికంగా కురిసిన, లేదా తక్కువ పడినా అంత మంచిది కాదు. దీని వల్ల పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు బాగా కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే కనుక జరిగితే ఇక రైతులు అధిక మొత్తంలో దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
ఇటీవల వాతావరణ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం, దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ మే 31 లోపు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. ప్రస్తుతం నైరుతిరుతుపవనాలు అండమాన్ మరియు నికోబర్ దీవుల్లోకి ప్రవేశించాయి. దీని ప్రకారం జూన్ మొదటి వారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు లో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి.
మరోపక్క బంగాళఖాతంలో రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి, దీనితో ఎల్ లీనో ప్రస్థితులు పోయి లానిన పరిస్థితులు వచ్చే రానున్నాయి, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ సముద్రం చల్లబడటంతో ఈ పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. లనినా ఏర్పడటం మూలాన ఈ సంవత్సరం సాధారణంకంటే అధికశాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరం శాఖ పేర్కొంది. దీనివలన రానున్న ఆగష్టు మరియు సెప్టెంబర్ లో అధిక వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తుంది.
Share your comments