News

పరిశుభ్రత లేని ఆహారం.... తిన్నారంటే ఆరోగ్యం హాం..ఫట్

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో నాణ్యమైన ఆహారమే కరువైపోయింది. కుటుంబంతో కలిసి ఆహారం తిందాం అని బయటకి వెళ్లినవారికి ఆహారంతో పాటు ఆనారోగ్యం కూడా అదనంగా లభిస్తుంది. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రమైన వంట గదులు, కల్తీ వంట పదార్ధాలు ఇదే ఇప్పటి ప్రస్తుతం హోటళ్లలో నడుస్తున్న పరిస్థితి. మనం రుచికరమనుకున్న ఆహారం వెనకాల ఇంత ఘోరమైన పరిస్థితి నెలకొంది. వాడిన నూనెనే తిరిగి మళ్ళి మల్లి వాడిన నూనెతో చేసిన ఆహారాన్ని తినడం మూలాన గుండెకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి.

ఆహార భద్రత అధికారులు గత 20 రోజులుగా హైదరాబాద్ ప్రాంతంలో ఆహార నాణ్యత తనిఖీలు చేపట్టారు. చాల హోటళ్లు మరియు రెస్టారెంట్లలో, ఆహార కల్తీ మరియు నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న రెస్టారెంట్లతో పాటు, బాగా పేరొందిన పెద్ద హోటళ్లల్లోనూ ఇదే పరిస్థితి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి, హోటల్ యాజమాన్యం అధిక లాభాలు పొందాలన్న ఆశతో, నాణ్యత లేని ఆహారని వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

ఆహార నాణ్యత అధికారులు జరిపిన తనిఖీల్లో ఎన్నో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. సెలవు రోజు వచ్చిందంటే జనంతో కిటకిటలాడే, రెస్టారెంట్లు, బేకరీల్లో, కాఫీ షాపుల్లో, ఆహార ప్రమాణాలకు తగ్గట్టు శుభ్రత పాటించడంలేదు. బూజుపట్టి కుళ్లిపోయే స్థితిలో ఉన్న కూరగాయలు, నాణ్యత లేని మసాలాలు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వఉంచని మాంశం, మరియు ఆహారంలో కలిపే ఫుడ్ కలర్స్, నాణ్యత లేని ఇతర ఆహార పదార్ధాలు కనుగొన్నారు.

ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇంటివద్ద నుండే ఆహారం కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టారు, ఆన్లైన్ ద్వారా ఐతే వినియోగదారులు నాణ్యతను మరియు వంటశాల పరిస్థితిని గుర్తించలేరు. పలు హోటళ్లలో నాణ్యత లేని ఆహారం లేకపోగా కాలం తీరిన ఆహారని సైతం విక్రయిస్తున్నారు. స్వీట్ షాప్ యజమానులు కూడా తక్కువ ధరకు లభించే పాలు వినియోగిస్తున్నారు. ఇటువంటి నాణ్యత లేని తరచూ తినడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంతవరకు ఇంటివద్ద తయారుచేసిన ఆహారం తినడానికే ప్రయత్నిచండి. ఆహారంలో ఏమైనా తేడాగా కనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించండి.

Share your comments

Subscribe Magazine