సాధారణంగా ప్రజలు బ్యాంకులకు వెళ్లి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం లేనివారు ఎటిఎం వద్ద నగదు విత్ డ్రా చేసుకుంటారు. డెబిట్ కార్డు ద్వారా నగదు డ్రా చేసుకునే సౌకర్యం ఉండటంతో బ్యాంకుల వద్ద క్యూ లో నిలబడే అవస్థ తగ్గుతుంది. మనకు అందుబాటులో ఉన్న ఈ ఎటిఎం సేవలను మరింత మెరుగుపరచడానికి హిటాచి పేమెంట్ సర్వీసెస్ కొత్త సౌలబ్యాన్ని మన ముందుగు తీసుకురానున్నది.
ఎటిఎం తయారీ రంగంలో మంచి గుర్తింపు ఉన్న హిటాచి పేమెంట్ సర్వీసెస్, తొందర్లోనే భరత్ అప్గ్రేడబుల్ ఎటిఎం మెషిన్స్ ప్రజల ముందుకు తీసుకురానునట్లు తెలిపింది. దేశంలోనే మొట్టమొదటిసారి హిటాచి ఈ రకం ఎటిఎం మెషిన్స్ ప్రవేశపెడుతుంది. అవసరాన్ని బట్టి ఈ ఎటిఎం లను నగదు రీసైక్లింగ్ అయ్యేవిధంగా అప్ గ్రేడ్ చెయ్యవచ్చని హిటాచి సంస్థ పేర్కొంది.
నగదు రీసైక్లింగ్ మెషిన్స్ వీటినే సిఆర్ఎం మెషిన్స్ అనికూడా అంటారు. ఈ ఎటిఎం మెషిన్స్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడం మరియు క్యాష్ డిపొసిట్ చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు తమ ఎటిఎంల ద్వారా నగదు ఉపసంహరించుకునే అవకాశం మాత్రమే కల్పిస్తాయి. అయితే సిఆర్ఎం ద్వారా ఈ రెండు సేవలను పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు తమ బ్రాంచులు వద్ద సిఆర్ఎం మెషిన్స్ ఉపయోగిస్తున్నాయి, రానున్న రోజుల్లో ఈ సేవలను విస్తరించి నగదు విత్ డ్రా మరియు డిపోసిట్ సేవలను ప్రజలకు మరించి చేరువకానున్నాయి.
ప్రస్తుతం హిటాచి భారత దేశంలో ఎన్నో చోట్ల ఎటిఎం సేవలను అందిస్తుంది. ఎటిఎంలు మరియు సిఆర్ఎంలు సంఖ్య 76 వేలకు పైమాటే. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లోనే ఎన్నో లావాదేవీలు చోటుచేసుకుంటున్నాయి, ఈ సందర్భంగా బ్యాంకులకు మరియు ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకుకు హిటాచి నగదు రీసైక్లింగ్ మెషిన్స్ ప్రవేశపెట్టనుంది. రాబోయే రోజుల్లో 1,00,000 అప్ గ్రేడబుల్, మెషిన్స్ మార్కెట్ ఉంటుందని ఈ సంస్థ అంచనా వేస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ ఏటీఎంలు తయారుచెయ్యడం మరొక్క ప్రత్యేకత.
Share your comments