News

ఈ పథకంతో రైతులకు ఏడాదికి రూ.36 వేలు.. అప్లై చేసుకోండిలా..

KJ Staff
KJ Staff

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం... రైతులకు పంట బీమాతో పాటు రైతులకు వ్యక్తిగతంగా కూడా బీమా అందిస్తోంది. రైతులకు ఇన్యూరెన్స్ సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకం ద్వారా రైతులకు కేంద్రం బీమా సదుపాయం కల్పిస్తోంది.

నెలనెలా రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొంత చెల్లిస్తుంది. లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం అందిస్తుంది. కేవలం రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల రైతలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. రూ.55 నుంచి రూ.200 వరకు ఎంతైనా నెల నెలా ప్రీమియం చెల్లించవచ్చు.

60 ఏళ్లు వచ్చేవరకు కట్టాలి. వయస్సును పరిగణలోకి తీసుకుని ప్రీమియం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చేవరకు కడితే.. ఆ తర్వాత నెలనెలా రూ.36 వేలు వస్తాయి. మహిళా రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. ఒకవేళ మధ్యలో స్కీమ్ నుంచి తప్పుకుంటే ..అప్పటివరకు కట్టిన డబ్బులు వచ్చేస్తాయి. ఒకవేళ ప్రీమియం చెల్లిస్తున్న రైతు హఠాన్మరణం చెందితే కుటుంబ సభ్యులకు సగం డబ్బులు వస్తాయి.

అప్లై చేసుకోవడం ఎలా?


-దగ్గరల్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకెళ్లాలి.
-మీరు పీఎం కిసాన్ పథకంలో ఉంటే.. వచ్చే రూ.6 వేలను ఈ పథకానికి ప్రీమియం కట్టుకోవడానికి ఉఫయోగించుకోవచ్చు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21 లక్షల మంది ఈ పథకంలో చేరారు. వీరిలో ఇప్పుడు 674
లక్షల మంది కొనసాగుతున్నారు.

Share your comments

Subscribe Magazine