News

ఏప్రిల్ 30తో గడువు పూర్తి.. రైతు భరోసాకు అప్లై చేసుకోండిలా?

KJ Staff
KJ Staff

రైతులకు ఎంత ఆర్థిక సహాయం చేసినా తక్కువే అని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు మాత్రమే సాయం చేస్తుండగా.. అన్నదాతలకు మరింత చేయూతనివ్వాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు అరకొరగా మాత్రమే సాయం చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. ప్రభుత్వాలు చేసే సాయం రైతన్నలకు సరిపోవడం లేదు. ప్రభుత్వాలు చేసే సాయం రైతులకు అంతంతమాత్రంగానే ఉంది.

అయితే రైతుల కోసం ఏపీ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ.7,500 సాయం చేస్తుంది. వీటిని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది. గత రెండేళ్లుగా ఈ పథకం అమలు చేస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులను త్వరలో ప్రభుత్వం జమ చేయనుంది.

దీనికి సంబంధించి ఇప్పుడే కసరత్తు జరుగుతోంది. మే 13న రూ.7,500 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోనివారికి, కొత్తగా పథకంలో చేరాలనుకునేవారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రైతులకు సూచించింది. అనంతరం మే 10న అర్హుల తుది జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనుంది.

ఈ ఏడాది ఇప్పటివరకు 54 లక్షల మంది రైతులు అర్హుత సాధించినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది 51.59 లక్షల మందికి రూ.6,928 కోట్లు సాయం అందించామని, ప్రస్తుత సంవత్సరంలో రూ.7,290 కోట్లకు పెట్టుబడి సాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే కౌలురైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది.

రైతు భరోసాకు అప్లై చేసుకోండిలా?

రైతు భరోసాకి అన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లేదు. కేవలం గ్రామ సచివాలయంకు వెళ్లి లేదా వాలంటీర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

రైతు భరోసా మీకు వస్తుందా?..లేదా?.. తెలుసుకోండిలా?

-ఈ లింక్‌పై https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Paymentstatus క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు లబ్ధిదారుల జబితాలో ఉందో.. లేదో తెలుస్తుంది.

డబ్బులు పడిన తర్వాత వచ్చాయో.. లేదో తెలుసుకోవడం ఎలా?

-రైతు భరోసా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-అందులోని పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ చూపించే captcha ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి
-అప్పుడు మీకు డబ్బులు వచ్చాయో.. లేదో తెలుస్తుంది.

Share your comments

Subscribe Magazine