కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకి సంబంధించిన నగదును లబ్ధిదారులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో తాజాగా జమ చేసింది. రూ. 2 వేలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవ్వగా.. పీఎం కిసాన్ నగదు క్రెడిట్ అయినట్లు రైతులకు మెసేజ్ రూపంలో బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. అటు, ఇటుగా వారం రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. ఈ విడతలో భాగంగా దాదాపు రూ.11.66 కోట్లును ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉంటే.. మీకు కొంచెం ఆలస్యమైనా డబ్బులు వస్తాయి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?.. లేదా? అనేది తెలుసుకోండిలా..
-పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
-ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత Beneficiary Status పై క్లిక్ చేయాలి
-ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేర్లను సెలక్ట్ చేసుకోవాలి.
-ఇక గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోండి
లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉన్నా డబ్బులు రాలేదా?.. ఇలా ఫిర్యాదు చేయండి
-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-contact us ట్యాబ్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత క్రింద help desk అనే బటన్ మీద క్లిక్ చేయండి.
-ఆ తర్వాత మీ ఫిర్యాదును నమెదు చేసి ఎంటర్ ప్లెస్ చేయండి
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాదికి రూ.6 వేలను రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేసింది. ఏడాదికి మూడు విడతలుగా ఈ డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్‌కి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకోనివారు చేసుకుంటే తర్వాతి విడతలో డబ్బులు జమ అవుతాయి.
Share your comments