News

మీకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఇలా ఫిర్యాదు చేయండి

KJ Staff
KJ Staff
pm kisan
pm kisan

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. 9వ విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ కంప్యూటర్ బటన్ నొక్కి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 9వ విడత కింద పీఎం కిసాన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు జమ చేశారు. మొత్తం రూ.18,500 కోట్లను రైతుల ఖాతాల్లో మోదీ జమ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మోదీ ముచ్చటించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మోదీ చెప్పారు.

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో.. లేదో చెక్ చేసుకోవడం ఎలా?

-https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లండి.
-అందులో కుడివైపున ఫార్మర్స్ కార్నర్‌లో బెనిపిషియరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత ఆధాన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా బ్యాక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి
-ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ వివరాలతో పాటు మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయనే వివరాలు అక్కడ చూపిస్తాయి
-దీంతో మీకు పీఎం కిసాన్ డబ్బులు మీకు పడ్డాయా.. లేదా అనే విషయం తెలుస్తుంది.

డబ్బులు పడకపోతే ఏం చేయాలి?

-ఎమ్మార్వో కార్యాలయంలో ఉండే పీఎం కిసాన్ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు.
-బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు పడకపోవచ్చు. అందుకే బ్యాంకు వెళ్లి చెక్ చేయించుకోవాలి.
-పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261 లేదా.. టోల్ ఫ్రీ నెంబర్ 1800115526కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
-ఇక పీఎం కిసాన్ వెబ్ సైట్ లో హెల్ప్ డెస్క్ అనే బటన్ మీద క్లిక్ చేసి కంప్లైట్ చేయవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలి?

-https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లండి
-కుడివైపున ఫార్మర్స్ కార్నర్ లో హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత రిజిస్ట్రర్ క్వర్రీ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబల్ లేదా అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి
-ఆ తర్వాత కింద గ్రీవెన్స్ టైప్ లో దేని మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి
-ఆ తర్వాత డిస్‌క్రిప్షన్ లో మీ ఫిర్యాదు నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయండి

Share your comments

Subscribe Magazine