News

కల్తీ పాలను గుర్తించడం ఎలా?

KJ Staff
KJ Staff
Adulterated Milk?
Adulterated Milk?

అత్యంత నిత్యావసర పానీయం పాలు. పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రతిరోజూ ఇంట్లో పాలు ఉపయోగిస్తారు.  ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పాలు అనేది అవసరం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి తాగే టీ నుంచి రాత్రి పడుకునే వరకు తాగే పాలు వరకు దీని అవసరం ఉంటుంది. అందుకే పాలు అనేవి ప్రతి మనిషికి అవసరం. ఇవి లేనిది ఇంట్లో ఏ పని జరగదు.

అయితే కొంతమంది అక్రమార్కులు పాలను కూడా కల్తీ చేస్తున్నారు. పాలల్లో నీళ్లు కలిపి కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఇక మరికొంతమంది అక్రమార్కులు పొడి ద్రవంతో పాలను తయారుచేసి మార్కెట్‌లోకి తెస్తున్నారు. కల్తీ పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వినియోగదారులకు ఏవి స్వచ్ఛమైన పాలు, ఏవి కల్తీ పాలు అనేది తెలుసుకునేందుకు చాలా కష్టతరంగా మారింది.

అసలు ఏవి స్వచ్ఛమైన పాలు.. ఏవి కల్తీ పాలు అనేది తెలుసుకోవడం ఎలా?.. ఇక్కడ తెలుసుకుందాం?..

చిన్న టిప్స్‌తో ఏవి స్వచ్ఛమైన పాటు.. ఏవి కల్తీ పాలు అనే విషయం తెలుసుకోవచ్చు. చదునైన బండపై రెండు చుక్కలు పాలు పోయండి. ఆ పాలు  పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలని చెప్పవచ్చు. ఇక పాలు పారిన దారిలో తెల్లగా ఏవీ కనిపించకుండా వేగంగా పారితే అవి కల్తీ  అని అర్థం చేసుకోవచ్చు.

ఇక మార్కెట్‌లో దొరికే కొన్ని పరికరాలతో కల్తీ పాలను గుర్తించవచ్చు. మార్కెట్‌లో దొరికే లాక్టోమీటర్‌తో కల్తీ పాలను గుర్తించవచ్చు. ఇది రూ.100 నుంచి రూ.300 మధ్య ఉంటుంది. ఇక మిల్క్ టెస్టింగ్ కిట్‌తో కూడా కల్తీ పాలను గుర్తించవచ్చు.

Related Topics

adulterated milk Milk

Share your comments

Subscribe Magazine