News

హైదరాబాద్‌లో మళ్లీ సమ్మర్ క్యాంపులు ప్రారంభం !

Srikanth B
Srikanth B

హైదరాబాద్: ఏప్రిల్ 25 నుండి మే 31 వరకు నగరంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) నిర్ణయించింది . ఈ వేసవిలో ఆరు నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు క్రీడా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించాలి నిర్ణయించింది .

ఈ మొత్తం క్యాంపు నిర్వహించడానికి  రూ.1.42 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కోవిడ్-19  పరిస్థితుల దృష్ట్యా  2020 మరియు 2021లో క్యాంపులు నిర్వహించబడనందున, క్రీడలను ప్రోత్సహించడానికి కార్పొరేషన్ ఈ ఘనంగా నిర్వహించాలి యోచిస్తోంది.

వార్షిక క్రీడా కార్యక్రమం 'సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2022' బ్యానర్ క్రింద తిరిగి రావడంతో, పౌర సంఘం నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 357 మైదానాల్లో 44 విభిన్న క్రీడా విభాగాలలో శిక్షణను అందిస్తోంది. శిబిరాలు ఉదయం 6.15 నుండి 8.15 వరకు ఉంటాయి మరియు ఆసక్తి గల అభ్యర్థులు  https://www.ghmc.gov.in/  వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోవచ్చు.

శిబిరం సజావుగా సాగేందుకు, మైదానంలో క్రీడా కార్యకలాపాలకు శిక్షణ ఇచ్చేందుకు మరియు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 780 మంది కోచ్‌లను నియమించారు. వారికి అందిస్తున్న సేవలకు గౌరవ వేతనం అందజేస్తామన్నారు. ఈ శిబిరాల వద్ద క్విజ్ పోటీలు మరియు టోర్నమెంట్‌లు కూడా నిర్వహించబడతాయి మరియు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని GHMC అధికారి తెలిపారు.

“ఏప్రిల్ 25న, మొదటి క్యాంపుగా చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో మొదటి క్యాంపు  ప్రారంభించబడుతుంది. ఈ క్యాంపులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చే స్తున్నామని అధికారులు తెలిపారు .

ఇది కూడా చదవండి .

TELANGANA:వ్యవసాయ రంగానికి ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవు స్పష్టం చేసిన: TS TRANSCO

Related Topics

Hyderabad GHMC Summer Camp

Share your comments

Subscribe Magazine

More on News

More