News

మోదీ నోట హైదరాబాద్ మాట.

S Vinay
S Vinay

HYDERABAD: సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆదివారం నాడు ప్రతి నెల తాను పాల్గొనె రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన పనుల గురించి మోదీ మాట్లాడుతూ బన్సిలాల్‌పేటలోని చారిత్రాత్మకమైన మెట్ల బావిని విజయవంతంగా పునరుద్ధరించడాన్ని మోదీ ప్రశంసించారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ మెట్ల బావి శిథిలావస్థలో లో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. ఐతే ఈ మెట్ల బావిని తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్ధరణ పనులు చేపట్టింది. బావి లోపల సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త,చెదారాన్ని తొలగించారు. (MA&UD) అధికారుల ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల మేరకు బావి నుండి సుమారుగా 2,000 టన్నుల వరకు చెత్తను తొలగించి నీటిని పరిశుభ్ర పరిచారు.

అయితే అధికారులు దీనిని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రణాళిక చేస్తున్నారు. ఆగస్టు 15 2022 న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక మెట్ల బావిని ప్రారంభిస్తామని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదే కాకుండా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మొత్తం మెట్ల బావులను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సన్నాహాలు ప్రారంభించింది. గుడిమల్కాపూర్ సమీపంలోని భగవాన్‌దాస్ బాగ్ బావోలి మరియు శివబాగ్ బావోలితో సహా ఇప్పటికే కొన్ని పునరుద్ధరించబడ్డాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' లో ప్రత్యేకంగా అభినందించడం తో అధికారులు ఆనందం వ్యక్తం చేసారు.నేడు ఆ బావిలో 33 అడుగులకు పైగా నీరు ఉండడంతో చుట్టుపక్కల ఉన్న 50కి పైగా బోరుబావుల్లో భూగర్భ జలాలు మెరుగయ్యాయి.అయితే గాంధీ ఆసుపత్రికి ఉన్న నీటి వనరులలో ఈ మెట్ల బావి కూడా ఒకటి. “ ఇందులో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడంతో 80వ దశకంలో బావి నిరుపయోగంగా మూత పడింది.

మరిన్ని చదవండి.

తెలంగాణ :ఖమ్మం మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర!

Share your comments

Subscribe Magazine

More on News

More